న్యూఢిల్లీ: ఢిల్లీ నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. రోజూ హర్యానా నుంచి ఢిల్లీకి 100 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని తాను నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఆమె మీడియాకు తెలిపారు. శుక్రవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మునికి నివాళి అర్పించిన తర్వాత దక్షిణ ఢిల్లీలోని భోగల్‌లో దీక్షకు కూర్చుంటానని చెప్పారు. హర్యానాలోని బీజేపీ సర్కారు ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదన్నారు.