Man Kills Wife At Maha Kumbh | కుంభమేళాకు భార్యను తీసుకెళ్లి.. హత్య చేసిన భర్త
Man Kills Wife At Maha Kumbh | ఒక వ్యక్తి తన భార్యను కుంభమేళాకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేశాడు. కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు. మహిళ హత్య గురించి తెలుసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన భార్యను కుంభమేళాకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేశాడు. కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు. మహిళ హత్య గురించి తెలుసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితుడైన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Man Kills Wife At Maha Kumbh) ఢిల్లీలోని త్రిలోక్‌పురికి చెందిన అశోక్ కుమార్ తన భార్య మీనాక్షితో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. ఫిబ్రవరి 18న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు వారు చేరుకున్నారు. కుంభమేళాలో సాన్నంతోపాటు ఇతర ఫొటోలు, వీడియోలను తన పిల్లలకు అశోక్ కుమార్ పంపాడు. తమ టూర్ సంతోషంగా సాగుతున్నట్లు వారికి చెప్పాడు. ఒక సత్రంలో వారు బస చేశారు. అయితే ఆ రాత్రి అక్కడి బాత్ రూమ్‌లో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఢిల్లీ చేరుకున్న అతడు కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు.
కాగా, ఫిబ్రవరి 18న బాత్రూమ్లో మహిళ మృతదేహాన్ని ఆ సత్రం మేనేజర్ గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ కనిపించడం లేదంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఇది తెలుసుకున్న మీనాక్షి సోదరుడు తన కుమారులతో కలిసి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. సోదరి మృతదేహాన్ని గుర్తించాడు. దీంతో ఆమె భర్త అశోక్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు తండ్రి మాటలు నమ్మని పిల్లలు తమ తల్లి కోసం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఆమె ఫొటోను చేతపట్టకుని అక్కడ వెతికారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ తల్లిని తండ్రి హత్య చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. చివరకు నిందితుడైన అశోక్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్న అతడు భార్య అడ్డుతొలగించుకునేందుకు కుంభమేళాకు తీసుకువచ్చి హత్య చేశాడని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

