కుక్క మూత్రం పోసిందని దాని యజమానిపై యాసిడ్ దాడి.. కటకటాల వెనక్కి తండ్రీ ఇద్దరు కొడుకులు
Fight Over Dog | రోజురోజుకు సమాజంలో సహనం నశిస్తున్నది. చిన్నచిన్న విషయాలకే గొడవలుపడి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లోనైతే
న్యూఢిల్లీ: రోజురోజుకు సమాజంలో సహనం నశిస్తున్నది. చిన్నచిన్న విషయాలకే గొడవలుపడి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లోనైతే ఇలాంటి గొడవలు ప్రాణాల మీదకే వస్తున్నాయి. తాజాగా పశ్చిమ ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో ఓ 50 ఏండ్ల వ్యక్తి తన కుక్కను తీసుకుని వాకింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో పొరుగు వ్యక్తి కమల్ ఇంటిముందు కుక్క మూత్రం పోసింది. బిల్డింగ్ పైనుంచి ఇది గమనించిన కమల్ కుక్క యజమానితో గొడవకు దిగాడు. కమల్ కొడుకులిద్దరు కూడా కిందకు వచ్చి గొడవపడుతున్నారు. ఈ క్రమంలో కమల్ టాయిలెట్స్ కడిగే యాసిడ్ తెచ్చి మొదటి అంతస్తు నుంచి కుక్క యజమానిపై గుప్పాడు.
ఈ ఘటనలో కుక్క యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కమల్‌ను, అతని కొడుకులు రోహిత్, హిమాన్షును అదుపులోకి తీసుకున్నారు. కమల్ ఇంటి నుంచి టాయిలెట్స్ కడిగే యాసిడ్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

