Delhi Excise Policy | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని మే 31 వరకు పొడిగించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా రిమాండ్ గడువు ముగియడంతో సిసోడియాను కోర్టు ముందు హాజరుపరుచగా.. కస్టడీని పొడిగించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ మనీలాండరింగ్ కేసుల్లో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనున్నది. ఆప్, ఈడీ, సీబీఐల వాదనలు ముగిసిన తర్వాత ఢిల్లీ హైకోర్టు మే 14న పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కారణాల జాబితా.. ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మద్యం పాలసీ కేసులో గత ఏడాది అరెస్టయిన మనీష్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు.