Delhi Blast | ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కశ్మీరీ ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ సహ కుట్రదారుడు అమీర్ రషీద్ అలీ కీలక విషయాలు వెల్లడించాడు. అంతేకాకుండా డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ ముజఫర్ గనైతో సహా ఇతర నిందితుల విచారణ ఆధారంగా శ్రీనగర్ పోలీసులు పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ డానిష్‌ను అరెస్ట్ చేశారు. డాక్టర్ ఉమర్ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రదేశంలో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో వదిలిపెట్టి వెళ్లాలని కుట్ర పన్నినట్లుగా అధికారులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ కోసం అన్వేషన జైష్ ఏ మహ్మద్‌తో ముడిపడి ఉన్న అంతర్రాష్ట్ర ఉగ్రవాద నెట్‌వర్క్‌పై దర్యాప్తులో ప్రమాదకరమైన కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లయ్యింది.
డానిష్ విచారణ ఆధారంగా 2021లో టర్కీకి వెళ్లిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ ఘనీ వైట్‌కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్ సభ్యుడు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ ఘనీతో కలిసి డాక్టర్ ఉమర్ తీవ్రవాదం వైపు వెళ్లాడని.. అక్కడ జైష్ ఏ మహ్మద్ భూగర్భ గ్రౌండ్ కార్యకర్తను కలిశాడు. ఈ అనుమానితుల ప్రొఫైల్ 20 సంవత్సరాల కిందట నియమించబడిన ఉగ్రవాదుల ప్రొఫైల్ నుంచి భిన్నంగా ఉంటుంది. 2000 సంవత్సరాల ప్రారంభం నుంచి 2020 వరకు ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న యువతపై దృష్టి సారించాయి. జైళ్లలో పెద్ద సంఖ్యలో యువత పెద్ద సంఖ్యలో యువత తీవ్రవాదానికి గురయ్యారు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో డాక్టర్ ఒమర్ నబీ 30 నుంచి 40 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు నిర్ధారించారు. పేలుడును మరింత శక్తివంతం చేయడానికి అమ్మోనియం నైట్రేట్‌తో పాటు ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించారని అనుమానిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్‌తో ఏ రసాయనాలను ఉపయోగించారో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. కారు వెనుక భాగంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్ ఒమర్ నబీ కారు హుడ్కు డిటోనేటర్‌ను అమర్చి, కారు వెనుక భాగంలో నిల్వ చేసిన పేలుడు పదార్థాలను పేల్చడానికి దాన్ని ఉపయోగించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
రెండు రోజుల కిందట పార్కింగ్ స్థలంలో 3.29 గంటల పాటు ఉమర్ బస చేసిన సమయంలో పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఒంటరిగా పేలుడు పదార్థాలను తయారు చేశాడా? మరెవరైనా సహాయం అందించారా? అన్న విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందు కోసం దర్యాప్తు సంస్థలు మొత్తం ప్రాంతం నుంచి డంప్ డేటాను సేకరించాయి. దర్యాప్తు సంస్థలు సంఘటన స్థలం నుంచి 40కిపైగా నమూనాలను సేకరించాయి. డిటోనేటర్ హుడ్ కింద ఉన్న బ్యాటరీకి అనుసంధానించినట్లుగా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి పలు సన్నని వైర్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానాలోని దాదాపు 5వేల సీసీటీవీ కెమెరాల సహాయంతో దర్యాప్తులు పేలుడు తర్వాత దాదాపు 500 నుంచి 600 మీటర్ల వ్యాసార్థంలో ఐ-20 కారు ముక్కలను స్వాధీనం చేసుకున్నాయి. ఏ రకమైన పేలుడు పదార్థం కారును చిన్న ముక్కలుగా విరిచిందో తెలుసుకోవడానికి వారి ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ, హర్యానా, జమ్మూ కశ్మీర్, యూపీలోని వివిధ ప్రాంతాలలో దర్యాప్తు బృందాలు నిరంతరం దాడులు జరుపుతున్నాయి.
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో మరణించిన ఆటో డ్రైవర్ బిలాల్ అహ్మద్ పోస్టుమార్టం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని గందర్బాల్లో నివసించే బిలాల్ కుటుంబం ఎస్ఎస్పీ ద్వారా ఢిల్లీ పోలసులను సంప్రదించి.. ఆదివారం ఢిల్లీకి వస్తామని చెప్పింది. అయితే, సమాచారం ఇచ్చినా కుటుంబం ఇంకా ఢిల్లీకి రాలేదని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. దాంతో బిలాల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదని తెలిపాయి. ఈ-రిక్షా డ్రైవర్ అయిన బిలాల్ వస్తువులను వదిలి ఎర్రకోటకు తిరిగి వస్తుండగా పేలుడులో గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. అదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ దాడి చేసిన డాక్టర్ ఒమర్ నబీ మృతదేహంలోని పలు ముక్కలు మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని డీఎన్ఏ ద్వారా గుర్తించారు. కానీ ఇంకా ఎవరూ ఇంకా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ముందుకు రాలేదు. అయితే, భద్రతా బలగాలు అతని కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 150 మీటర్ల దూరంలో ఉన్న గౌరీ శంకర్ ఆలయం సమీపంలోని టాయిలెట్ పైకప్పుపై మనిషి చెయ్యి దొరికింది. ఇది బాంబర్ ఉమర్‌దిగా భావిస్తున్నారు. ఆ చేయిని కూడా కూడా శరీర భాగాలతో పాటు మార్చూరీలో ఉంచారు.