న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు ప్రధాన నిందితుల్ని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) తాజాగా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఉగ్ర కుట్రలో బాంబర్(ఉమర్ నబీ)కి సహాయకుడిగా పనిచేసిన ఓ డాక్టర్, మరో మహిళా డాక్టర్ అరెస్టయిన నలుగురిలో ఉన్నారు.
నిందితులకు పటియాలా కోర్టు 10 రోజులపాటు రిమాండ్ విధించింది. డాక్టర్ ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డాక్టర్ అదీల్ అహ్మద్ (అనంత్‌నాగ్), డాక్టర్ షాహీన్ సయీద్ (లక్నో), ముఫ్తీ ఇర్ఫాన్ వాగే(సోఫియాన్)లు ఉగ్రకుట్రలో ప్రధాన పాత్ర పోషించారని ఎన్ఐఏ ఆరోపించింది.