విమానాశ్రయంలో చోరీ.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై కేసు..!
Delhi Airport | ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఆరోపణల మేరకు ఢిల్లీ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చెకింగ్ సమయంలో తన బ్యాగులో నుంచి దాదాపు రూ.50వేల నగలు, విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయని
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఆరోపణల మేరకు ఢిల్లీ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చెకింగ్ సమయంలో తన బ్యాగులో నుంచి దాదాపు రూ.50వేల నగలు, విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయని బాధిత మహిళ ఆరోపించింది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ సెక్షన్ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ సెక్షన్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితురాలు పేర్కొంది. అకేష్ని సింగ్ గౌర్ (40 ) సిడ్నీ నుంచి ఆగస్టు 11న ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లోని నగలు, నగదు చోరీకి గురైనట్లు సమాచారం.
బాధిత మహిళ బంధువులు మృతి చెందగా.. పాల్గొనేందుకు భారత్‌కు వచ్చింది. అయితే, హైదరాబాద్‌కు వచ్చాక చోరీ విషయం తెలిసిందని, ఢిల్లీ విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో మాత్రమే ఆమె తన హ్యాండ్‌బ్యాగ్ లేదని పేర్కొన్న ఆమె.. లగేజీని తనిఖీ చేసిన తనిఖీ చేసిన సమయంలోనే చోరీ జరిగినట్లు రోపించింది. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ తదితర పౌర విమానయాన శాఖ మంత్రితో పాటు అధికారులకు విచారణ కోసం లేఖలు రాసినట్లు అకేష్నీ సింగ్ చెప్పారు. డిసెంబర్ 30న, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ నుంచి ఈ మెయిల్ వచ్చిందని, దర్యాప్తులో చేరమని కోరుతూ లేఖ రాసినట్లు పేర్కొంది. సీఐఎస్ఎఫ్కి చెందిన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కూడా దీనిపై విచారణ జరుపుతున్నట్టు బాధితురాలు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

