లక్నో: ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని రక్షణ శాఖ ఆయుధ కర్మాగారం నుంచి రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌కు చేర వేస్తున్న ఉద్యోగి రవీంద్రకుమార్, అతడి సహాయకుడిని యూపీ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు స్పేస్ ప్రాజెక్ట్, సైన్యానికి చెందిన డ్రోన్ ప్రాజెక్టు వివరాలను పాకిస్థాన్ మహిళకు అందించినట్టు దర్యాప్తులో తేలిందని ఏటీఎస్ చీఫ్ నిలబ్జ చౌదరి వెల్లడించారు. ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఓ మహిళ నేహా శర్మ అనే మారు పేరుతో ఫేస్బుక్లో పరిచయం చేసుకుని, రవీంద్రకుమార్‌ను ట్రాప్ చేసినట్టు గుర్తించారు. ఆయుధాల తయారీకి సంబంధించిన కీలక సమాచారం చేర వేసినట్టు ఓ అధికారి చెప్పారు.