భూమిపై మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. ఈ రిజుతా ఘోష్ దేబ్ అనే డిజిటల్ క్రియేటర్‌ను చూస్తే అది నిజమే అనిపిస్తున్నది. ఆమె అచ్చం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేలా ఉంది. ఈమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రిజుతాను చూస్తే దీపికా పదుకొనే భర్త రన్వీర్సింగ్కూడా కన్ఫ్యూస్ అవుతాడేమో అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
దీపికా పదుకొనేను పోలిన రిజుతా ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ముక్కు, కళ్లు, హెయిర్ స్టైల్ అచ్చం దీపికా పదుకొనేలా ఉండడంతో రిజుతాను నెటిజన్లు దీపిక 2.0 అని పిలుస్తున్నారు. రిజుత నువ్వు దీపికా పదుకొనే జిరాక్స్ కాపీవి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఎవరీ రిజుతా ఘోష్ దేబ్?
రిజుతాది పశ్చిమ బెంగాల్. ఆమె డిజిటల్ క్రియేటర్. ఆమె కోల్‌కతా, మ్యూనిచ్ మధ్య ఎక్కువగా ప్రయాణాలు చూస్తే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 55వేల మందికంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. తన ఇన్‌స్టా ఫీడ్‌లో ఆమె ఎక్కువగా అందం, ఫ్యాషన్, జీవనశైలికి సంబంధించిన పోస్ట్‌లు పెడుతుంటారు. ఆమె కొన్ని ఫొటోలు చూస్తే దీపికా పదుకొనేనా అని మీరు భ్రమపడతారు.