Lift crash | లిఫ్టు కూలిన ఘటనలో 8 కి చేరిన మరణాల సంఖ్య
Lift crash | గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని సర్వీస్ లిఫ్టు కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
నోయిడా: గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని సర్వీస్ లిఫ్టు కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆస్పత్రిలో ఉన్న మరో క్షతగాత్రుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నది.
శుక్రవారం ఉదయం గ్రేటర్ నోయిడాలోని ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ హౌసింగ్ సొసైటీలో నిర్మాణంలో ఉన్న భవనంలోని సర్వీస్ లిఫ్టు వైర్ తెగడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయంకల్లా గాయపడిన వారిలో నలుగురు మృతిచెందారు.
బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీ (Gaur City )లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది కార్మికులు భవన నిర్మాణ సామాగ్రిని లిఫ్టులో పైకి తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

