DD Lapang : మేఘాలయ (Meghalaya) మాజీ ముఖ్యమంత్రి (Former CM) డీడీ లాపాంగ్ (DD Lapang) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో గత కొంతకాలంగా షిల్లాంగ్ ఆస్పత్రి (Shillang hospital) లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
లాపాంగ్ మేఘాలయ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాంతో సుదీర్ఘకాలంపాటు మేఘాలయ సీఎంగా పనిచేసిన వ్యక్తిగా లాపాంగ్ గుర్తింపు దక్కించుకున్నారు. లాపాంగ్ 1934 ఏప్రిల్ 10న జన్మించారు. ఆయన 1992 నుంచి 2008 మధ్య నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
1972లో తొలిసారి ఆయన మేఘాలయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాంగ్పో అసెంబ్లీ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. సీఎంగా ఎన్నిక కాకముందు రెండు దశాబ్దాలపాటు ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు.