పిల్లలకు కొవాగ్జిన్ ఓకే

- అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
భారత్ బయోటెక్ తయారు చేసిన స్వదేశీ కరోనా టీకా కొవాగ్జిన్‌ను కొన్ని పరిమితులకు లోబడి 12-17 ఏండ్ల వారికి కూడా వేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతినిచ్చింది. టీకాకు అత్యవసర వినియోగం కింద ఆమోదం లభించినట్టు అధికారులు శనివారం తెలిపారు. 18 ఏండ్ల లోపువారికి వేయడానికి డీసీజీఐ అనుమతి పొంది రెండో టీకా ఇది. ఇంతకుముందు జైడస్ క్యాడిలా టీకా జైకోవ్-డీకి అత్యవసర వినియోగం కింద అనుమతి లభించింది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ను 2-17 ఏండ్ల పిల్లలపై పరీక్షించింది. ట్రయల్స్ సమాచారాన్ని అక్టోబర్ నెలలో సీడీసీఎస్వోకు సమర్పించింది. కొవాగ్జిన్‌ను 2-17 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు అనుమతివ్వాలని అక్టోబర్ 11న సిఫారసు చేసింది. టీకా ట్రయల్స్‌పై అదనపు సమాచారం కోరిన డీసీజీఐ.. దానిని విశ్లేషించి 12 ఏండ్లు నిండిన వారికి మాత్రమే కొన్ని పరిమితులకు లోబడి వేయడానికి అనుమతించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- covaccine
- DCGI
- DCGI approves
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

