Mamata Benargee | పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రెండు రోజుల్లో మరోమారు విమాన ప్రమాదం తప్పింది. ఈ సంగతి స్వయంగా మమతా బెనర్జీ సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో అన్నారు. తాను ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానానికి ఎదురుగా మరో విమానం వచ్చిందన్నారు.
మరో పది సెకన్లు ఇలాగే సాగితే రెండు విమానాలు ఢీకొనేవని మమతా బెనర్జీ తెలిపారు. తాము ప్రయాణిస్తున్న విమానం ఆరు వేల అడుగున వెళుతుందన్నారు. కానీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించారని చెప్పారు. ఈ ప్రమాదంలో తన వెన్నముకకు, ఛాతీకి గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటికీ నొప్పిగా ఉందన్నారు.
ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం సమాజ్వాదీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు మమతా బెనర్జీ. యూపీలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా, ఆమెకు పెను ప్రమాదం తప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని శనివారం సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది.