న్యూఢిల్లీ: ఫస్ట్ లవ్, డేటింగ్, రిలేషన్షిప్స్.. వంటి అంశాలపై 9వ తరగతి విద్యార్థుల ‘వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్’లో సీబీఎస్ఈ పాఠ్యాంశాల్ని పొందుపర్చింది. డేటింగ్, రిలేషన్షిప్స్ అంటే ఏంటి? వీటి మంచిచెడులను విద్యార్థులకు తెలుపటంతోపాటు, ఆన్లైన్లో తరుచూ వినపడే ఘోస్టింగ్ (రెండో ముఖం లేదా ముసుగు), క్యాట్ఫిషింగ్ (ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించటం), సైబర్బుల్లీయింగ్ (సైబర్ దాడులు, వేధింపులు).. మొదలైన పదాలను వివరించటం ఈ పాఠ్యాంశాల ముఖ్య ఉద్దేశం. డేటింగ్, రిలేషన్షిప్స్ పాఠ్యాంశాలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నేటి కాలంలో విద్యార్థులకు ఈ పాఠాలు అవసరమేనని చాలామంది అభిప్రాయపడ్డారు. ‘బ్రేకప్’పైనా పాఠ్యాంశం తీసుకురావాలని డేటింగ్ యాప్ ‘టిండర్ ఇండియా’ అభిప్రాయపడింది.