గురువారం 02 జూలై 2020
National - Jun 05, 2020 , 08:25:22

రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు

రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు

ఒడిశా: ఒడిశాలో ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్‌ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భూమికి సంబంధించిన సెటిల్‌మెంట్‌ కోసం సాహూ అనే వ్యక్తిని డాటా ఎంట్రీ ఆపరేటర్‌ రష్మి రేఖాప్రధాన్‌ లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు సాహూ రూ.1.20 లక్షలు ఇస్తుండగా విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

బలియంట తహసీల్దార్‌ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా రష్మిరేఖా ప్రధాన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని..అదుపులోకి తీసుకున్నాం. అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని భువనేశ్వర్‌ విజిలెన్స్‌ ఎస్పీ సర్దాక్‌ సారంగి తెలిపారు. logo