తాజ్‌మహల్‌ను సందర్శించిన డానిష్ ప్రధాని
Danish PM Mette Frederiksen | డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రేమ సౌధం తాజ్‌మహల్‌ను ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ ప్రదేశంగా అద్భుతమైందని పేర్కొన్నారు.

ఆగ్రా : డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రేమ సౌధం తాజ్‌మహల్‌ను ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ ప్రదేశంగా అద్భుతమైందని పేర్కొన్నారు. తాజ్‌మహల్ సందర్శన కోసం ఆమె తన భర్త టెంగ్బర్గ్తో కలిసి శనివారం రాత్రి ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ యూపీ ఇంధనశాఖ మంత్రి శర్మ ఆమెకు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమర్ విలాస్‌లో బస చేశారు. ఇవాళ ఉదయం 10.50గంటలకు తాజ్ మహల్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు స్థానిక కళాకారులు ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. డానిష్ ప్రధాని గంటన్నరకుపైగా తాజ్‌మహల్‌లో ఉండగా.. గైడ్ ఆమెకు తాజ్ మహల్ గురించి వివరించారు. ఆ తర్వాత ఆమె సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ‘ఈ ప్రదేశం అందంగా ఉంది’ అని పేర్కొన్నారు. వీవీఐపీ సందర్శన సమయంలో తాజ్‌మహల్, ఆగ్రా కోటను రెండు గంటల పాటు మూసివేసినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. డానిష్ ప్రధాని తొలిసారిగా భారతదేశ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

