మోరెనా, జూన్ 7: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో దళితులకు రక్షణ లేకుండా పోతున్నది. దళిత సర్పంచును కొందరు వ్యక్తులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. మోరెనా జిల్లాలోని కౌతర్కలాన్ పంచాయతీ సర్పంచ్‌ను వెంటనే పదవి విడిచిపెట్టి ఊరు నుంచి వెళ్లిపోవాలని గత రెండేళ్లుగా కొందరు వేధిస్తున్నారు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో అతడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. బాధితుడు గురువారం పోర్సా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గూండాల వేధింపులు తాళలేక సర్పంచ్ గ్రామాన్ని విడిచిపెట్టారని స్థానికులు తెలిపారు.