న్యూఢిల్లీ: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సూపర్‌స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) ఇవాళ తన సతీమణి లతతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రజినీకాంత్‌కు శుభాకాంక్షలు చెప్పి అభినందనలు తెలియజేశారు. అనంరతం ప్రధాని నివాసానికి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని కూడా రజినీకాంత్‌ను అభినందించారు.
ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫొటోలను రజినీకాంత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, ప్రధాని నరేంద్రమోదీని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం, అభినందనలు పొందడం చాలా ఆనందంగా ఉన్నదని రజీనికాంత్ తన ట్విట్టర్ పోస్టుకు ఒక క్యాప్షన్ జతచేశారు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా.. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ఉత్సవాల్లో రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు.
Dadasaheb Phalke award winner, superstar Rajinikanth met President Ram Nath Kovind and Prime Minister Narendra Modi today.
— ANI (@ANI) October 27, 2021
(Pics courtesy: Rajinikanth's Twitter account) pic.twitter.com/tauFbtxas6