‘యాస్’ ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈదురు గాలుల బీభత్సం
Yaas Cyclone: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతున్నదని

అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా కొనసాగుతున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌వల్ల నెల్లూరులోని దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువ తీరం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని వెల్లడించింది. సముద్రంలో అలలు రెండున్నర నుంచి ఐదు మీటర్ల వరకూ ఎగసిపడతాయని తెలిపింది.
మత్స్యకారులు రేపటివరకు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాన్ ఉత్తర ధమ్రా-ఒడిశాలోని బాలాసోర్ మధ్య ఈ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 60 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కన్నబాబు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

