న్యూఢిల్లీ, మార్చి 28: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ‘డీఆర్డీవో’కు సంబంధించి సున్నితమైన రక్షణ సమాచారం లీకైందని సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎథీనియన్ టెక్’ తేల్చింది. డీఆర్డీవో మాజీ ఉద్యోగి పరికరం నుంచి ఆ సమాచారాన్ని హ్యాకర్లు దొంగలించారని, లీకైన డాటాలో అత్యంత రహస్య పత్రాలు, ఆయుధ రూపకల్పనలో సున్నితమైన రక్షణ సమాచారం ఉందని ఎథీనియన్ నివేదిక పేర్కొన్నది.
ఓ హ్యాకర్ గ్రూప్ డీఆర్డీవో సమాచారాన్ని దొంగలించి..శాంపిల్‌గా కొంత డాటాను బయటపెట్టింది. సమాచారంలో అత్యధిక భాగం డీఆర్డీవో మాజీ అధికారి పనీత్ అగర్వాల్‌కు చెందిన పరికరంలోనిదేనని‘ఎథీనియన్’తేల్చింది.