న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు భారీ విఘాతం ఏర్పడింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు చెందిన ఈ-మెయిల్ సర్వర్‌ను హ్యాక్ చేశారు. డేటాను దొంగలించిన హ్యాకర్లు ఆ తర్వాత ఆ సమాచారాన్ని అమ్మకానికి పెట్టారు. సుమారు 15 మంది ఉన్నతాధికారుకుల చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సేల్ కోసం పెట్టినట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఓ బీజేపీ మంత్రి కూడా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి ఆ మంత్రికి నేరుగా అప్డేట్స్ వస్తుంటాయి.
గత ఏడాది ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ అటాక్‌పై సమగ్ర నివేదికను భారత ప్రభుత్వం కోరింది. అయితే నార్త్ కొరియాకు చెందిన లజారస్ గ్రూపు.. సైబర్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.