ఢిల్లీ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వాచ్ ఇది. దీని విలువ రూ.27 కోట్లు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు గడియారం చూసి అధికారులే షాక్కు గురయ్యారు. దీంతోపాటు మరో ఆరు లగ్జరీ వాచ్లను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన వాచీల విలువ సుమారు 60 కిలోల బంగారానికి సమానం.