న్యూఢిల్లీ, జూన్ 23: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘సీయూఈటీ యూజీ-2026’ ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) మంగళవారం ప్రవేశ పరీక్షల ఫలితాల్ని విడుదల చేసింది.
పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక పోర్టల్ cuet.nta.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.