Eid Prayers | చర్చిలో ముస్లింల ఈద్ ప్రార్థనలు..
కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల (Eid Prayers) కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్ మెమోరియల్ సీఎస్ఐ చర్చి (CSI Church) అధికారులు ముస్లిం సోదరులను ఆహ్వానించారు.
మలప్పురం: కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల (Eid Prayers) కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్ మెమోరియల్ సీఎస్ఐ చర్చి (CSI Church) అధికారులు ముస్లిం సోదరులను ఆహ్వానించారు. దీంతో చర్చి ఆవరణలో ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో తరలివచ్చిన దృశ్యం కనువిందు చేసింది.
పట్టణంలోని ముస్లింలు ఏటా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని గ్రౌండ్లో ఈద్ ప్రార్థనలు చేసుకునేవారు. అయితే లోక్సభ ఎన్నికల కారణంగా అధికారులు పాఠశాలను మూసివేశారు. దీంతో రంజాన్ ప్రార్థనలకు గేట్లు తెరవాలని నిర్ణయించిన చర్చి పెద్దలు ముస్లిం ప్రముఖులకు తెలియజేశారు.ఈ నేపథ్యంలో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది. చర్చి ఆవరణలో రంజాన్ ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసిన దృశ్యం కనువిందు చేసింది. కాగా, పవిత్రమైన రోజున ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తమకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ఫాదర్ ఫ్రాన్సిస్ జాయ్ మస్లామణి (Father Joy Masilamani) అన్నారు. ముఖ్యంగా మతపరమైన ఉద్రిక్తతలతో కూడిన సమయాల్లో ప్రేమ, ఐక్యత ప్రాముఖ్యతను చాటాలని వెల్లడించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

