న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్‌కు పాకిస్థాన్ మహిళతో పెళ్లి జరిగింది. అయితే ఈ విషయాన్ని దాచినందుకు అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. (CRPF sacks jawan for marring Pak woman) ఆ జవాన్ ప్రవర్తన జాతీయ భద్రతకు హానికరమని సీఆర్పీఎఫ్ ఆరోపించింది. శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌కు చెందిన జవాన్ మునీర్ అహ్మద్‌కు రెండున్నర నెలల కిందట పాకిస్థాన్ మహిళ మినాల్ ఖాన్‌తో ఆన్లైన్లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చింది. దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసింది. సీఆర్పీఎఫ్ జవాన్ అయిన భర్త మునీర్ అహ్మద్‌తో కలిసి జమ్మూలో ఆమె నివసిస్తున్నది.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయుల వీసాలను భారత్ రద్దు చేసింది. దీంతో వీసా గడువు ముగిసిన పాక్ మహిళ మినాల్ ఖాన్‌ను దేశం నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె జమ్ముకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించింది. అధికారులు పంపడంతో పాక్ తిరిగి వెళ్లేందుకు భర్తతో కలిసి జమ్మూ నుంచి పంజాబ్‌లోని అట్టారి సరిహద్దుకు చేరుకున్నది.
మరోవైపు పాక్ మహిళ మినాల్ ఖాన్‌కు చివరి నిమిషంలో దేశ బహిష్కరణ నుంచి జమ్ముకశ్మీర్ హైకోర్టు ఊరట ఇచ్చింది. ఆమెను అట్టారి నుంచి జమ్మూకు పంపాలని ఏప్రిల్ 30న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ అహ్మద్‌కు పాక్ మహిళ మినాల్ ఖాన్‌తో పెళ్లి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివాహాన్ని దాచినందుకు అతడ్ని ఉద్యోగం నుంచి సీఆర్పీఎఫ్ తొలగించింది.