CRPF DG : సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS office) వితుల్ కుమార్ (Vitul Kumar) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force) డైరెక్టర్ జనరల్ (Director General) గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న అనీష్ దయాల్ సింగ్ (Anish Dayal Singh) మంగళవారం పదవీ విరమణ చేయనుండటంతో.. ఆయన స్థానంలో వితుల్ కుమార్‌ను నూతన డీజీ నియమించారు.
వితుల్ కుమార్ 1993 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1988 బ్యాచ్ మణిపూర్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అనీష్ దయాల్ సింగ్‌ను 2024 డిసెంబర్ 31 వరకు సీఆర్పీఎఫ్ డీజీగా నియమించారు. రేపటితో ఆయన పదవీకాలం ముగియనుండటంతో కొత్త డీజీని నియమించారు.