న్యూఢిల్లీ : గర్ల్‌ఫ్రెండ్ కుటుంబం నుంచి తప్పించుకోవడం కోసం ఓ పాకిస్థానీ యువకుడు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జగ్సీకోలి ఆదివారం రాజస్థాన్‌లోని బామర్ జిల్లా, జప్డలోకి ప్రవేశించగా బీఎస్ఎఫ్ అధికారులు ప్రశ్నించారు.
తాను అంతర్జాతీయ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నానని, అక్కడికి 8 కి.మీ. దూరంలో ఉంటున్న పాకిస్థానీ అమ్మాయితో అఫైర్ ఉందని, ఆమెను తీసుకెళ్లిపోవడం కోసం వారి ఇంటికి వెళ్తే కుటుంబ సభ్యులు పసిగట్టారు. వారి నుంచి తప్పించుకోవడం భారత్‌లో ప్రవేశించాడు. ఇతనిని స్థానిక పోలీసులకు సోమవారం బీఎస్ఎఫ్ అప్పగించింది.