భోపాల్: ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన ఒక ఆవు అక్కడ పేడ వేసింది. దీంతో ఆ గదంతా ఆవు పేడతో రొచ్చుగా ఉంది. ఈ నేపథ్యంలో ఏటీఎం యంత్రం నుంచి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. తన టీ షర్ట్‌తో ముక్కు మూసుకుని డబ్బులు డ్రా చేశాడు. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని గ్రామంలో ఈ సంఘటన జరిగింది. డబ్బులు డ్రా చేసేందుకు ఒక వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అయితే అక్కడి ఏటీఎం యంత్రం ముందు ఒక ఆవు కూర్చొని ఉంది. అది అప్పటికే అక్కడంతా పేడ వేసింది. ఆ ఏటీఎం కేంద్రం అంతా పేడతో రొచ్చుగా ఉంది. దీంతో ఆ వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. తన టీ షర్ట్‌తో ముక్కు మూసుకుని డబ్బులు విత్ డ్రా చేశాడు.
కాగా, ఆ ఏటీఎం బయట ఉన్న ఆ వ్యక్తి బంధువు తన మొబైల్లో వీడియో రికార్డు చేశాడు. జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. ఏటీఎం కేంద్రంలో ఏసీ ఉండటంతో ఆవు అక్కడకు వచ్చి ఉంటుందని ఒకరు పేర్కొన్నారు. అయితే ఆ ఆవు ఏటీఎం మెషిన్‌కు రక్షణగా ఉందంటూ మరొకరు చమత్కరించారు. కాగా, ఆ ఏటీఎం కేంద్రం నిర్వాహణ తీరు, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడాన్ని కొందరు విమర్శించారు.
एटीएम में गाय ने गोबर किया, नाक बंद किए चाचा का रिएक्शन वायरल
मध्यप्रदेश के रीवा के नईगढ़ी का ये वीडियो वायरल हो रहा है जहां ATM बूथ को गाय ने घर बना रखा है। और एक व्यक्ति नाक दबाए पैसे निकालने पहुंचा है।
ये वीडियो व्यक्ति के भतीजे ने रिकार्ड किया है। pic.twitter.com/084ecYsye2
— Shubhankar Mishra (@shubhankrmishra) September 22, 2022