న్యూఢిల్లీ: సూదులంటే భయపడేవారికి పరిష్కారం చూపుతూ ముక్కు ద్వారా అందించే కొవిడ్-19 టీకాను గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న ఈ టీకా వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది సింగిల్ డోస్ టీకా. దీనిని ‘సీడీఓ-7ఎన్-1గా పిలుస్తున్నారు. వ్యాప్తి, రీ ఇన్ఫెక్షన్, కొత్త వేరియంట్ల పుట్టుకను నిరోధించడంలో ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని డాక్టర్ గ్జియాంగ్ లియూ తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీ లైసెన్స్‌ను ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్కు ఇచ్చారు.