బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 16:41:44

లాక్‌డౌన్‌ ప్రభావం... అతిథులు లేకుండానే పెండ్లి

లాక్‌డౌన్‌ ప్రభావం... అతిథులు లేకుండానే పెండ్లి

విశాఖపట్నం : హిందూ సాంప్రదాయంలో పెండ్లి అంటే ఎంత కన్నుల పండుగగా జరుగుతుందో మనందరికి తెలిసిందే. కరోనా ప్రభావంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తే మంగళవాయిద్యాలు, అతిథులెవరూ లేకుండానే తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. ఇటువంటి ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అనకాపల్లి ఎన్టీఆర్‌ కాలనీలో గత రాత్రి 11.20కి ఓ పెండ్లి జరిగింది. మహేశ్‌, సౌజన్య అనే ఇద్దరు పెండ్లితో ఒక్కటయ్యారు. పెండ్లి కుమారుడి ఇంట్లో జరిగిన ఈ వివాహానికి కేవలం ఏడుగురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో ఆరుగురు కుటుంబ సభ్యులు కాగా ఒకరు పూజారి. పెండ్లి కొడుకు తండ్రి స్పందిస్తూ... నాలుగు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలను పాటించాలి కాబట్టి నిరాడంబరంగా పెండ్లి జరిపించినట్లు తెలిపారు. 


logo