ఐక్యంగా ఉంటేనే లక్ష్యాలను చేరుకోగలుగుతాం: ప్రధాని మోదీ
PM Modi | సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ కోసం పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ కోసం పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. భారత్ బలంగా ఉండాలని ఆకాంక్షించారని చెప్పారు. దేశ మొదటి ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పటేల్ స్ఫూర్తితోనే దేశం ఇప్పుడు అన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నదని చెప్పారు. మనం ఐక్యంగా ఉంటేనే లక్ష్యాలను చేరుకోగలుగుతామన్నారు. దేశం మొత్తం ఆయనకు ఈరోజు నివాళులు అర్పిస్తుందని తెలిపారు.
భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదని.. ఎన్నో ఆదర్శాలు, నాగరికత, సంస్కృతికి ప్రతిరూపమని ప్రధాని అన్నారు. 135 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని చెప్పారు. దేశప్రజలంతా ఐక్యంగా ఉంటేనే.. దేశం తన లక్ష్యాలను సాధించగలుగుతుందని పేర్కొన్నారు.
భారతీయ సమాజం, సంస్కృతి నుంచే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది పడిందన్నారు. గత ఏడేండ్లలో పనికిరాని చట్టాలను తొలగించామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో దేశంలోని భౌగోళిక ప్రాంతాల మధ్య దూరం తగ్గుతున్నదని చెప్పారు.
పటేల్ విగ్రహం.. దేశ భవిష్యత్తుకు సూచిక: అమిత్ షా

వల్లభాయ్ పటేల్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. గుజరాత్‌లోని కెవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ ఐక్యత దినోత్సవానికి ప్రాముఖ్యత ఉందని చెప్పారు. స్వాతంత్య్రం తర్వాత బ్రిటీషర్లు దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారని, వారి కుట్రను సర్దార్ పటేల్ భగ్నం చేశారని చెప్పారు. అఖండ్ భారత్ చేయాలని పటేల్ సంకల్పించారన్నారు. ఎత్తయిన పటేల్ విగ్రహం.. ఉజ్వలమైన దేశ భవిష్యత్తుకు సూచిక అని, ఇది దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీయలేరనే సందేశమిస్తున్నదని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

