శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 11:25:22

దేశంలో క‌రోనా కేసులు 562.. మ‌ర‌ణాలు 11 కాదు తొమ్మిదే

దేశంలో క‌రోనా కేసులు 562.. మ‌ర‌ణాలు 11 కాదు తొమ్మిదే

 న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. మంగ‌ళ‌వారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 562కు చేరింది. వీరిలో 41 మంది పూర్తిగా కోలుకున్నారు. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇక మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు తొమ్మిదేన‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. అంత‌కుముందు ప్ర‌క‌టించిన‌ట్టుగా 11 కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఢిల్లీలో చోటుచేసుకున్న రెండో మ‌ర‌ణం క‌రోనావ‌ల్ల కాద‌ని తాజాగా తేల‌డంతోపాటు, త‌మిళ‌నాడులో చోటుచేసుకున్న తాజా మ‌ర‌ణం కూడా క‌రోనా వ‌ల్ల‌నా, కాదా అనేది ఇంకా అధికారికంగా ధృవీక‌రించ‌బ‌డ‌నందున మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 11 నుంచి 9 కి త‌గ్గింది. 

ఇదిలావుంటే ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్రకు చెందిన‌వారు ఇద్ద‌రు, బీహార్‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, పంజాబ్‌, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల‌కు చెందిన‌వారు ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. ఇక దేశంలో అత్య‌ధికంగా కేర‌ళ‌లో 109 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌హారాష్ట్ర 101 కేసుల‌తో ఆ త‌ర్వాత స్థానంలో ఉన్న‌ది. ఇదిలావుంటే దేశంలో న‌మోదైన మొత్తం 562 క‌రోనా పాటివ్ కేసుల్లో 43 మంది విదేశీయులే ఉన్న‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 


logo