హైదరాబాద్ : ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ బయోలాజికల్-ఈ రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోస్‌గా వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ టీకాను వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండు డోసుల కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైతం కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్‌గా వేసేందుకు ఆమోద ముద్ర వేసింది. కార్బెవాక్స్ హెటెరోలాజస్ కొవిడ్-19 బూస్టర్‌గా ఆమోదం పొందిన మొదటి వ్యాక్సిన్‌గా నిలిచింది. కొవిడ్ రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాత బయోలాజికల్-ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. టీకాను బూస్టర్ డోస్‌గా వేసేందుకు డీసీజీఐ ఆమోదం తెలుపడంపై కంపెనీ కంపెనీ ఎండీ మహిమా దాట్ల హర్షం వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా బూస్టర్ డోస్‌ల అవసరాన్ని తగ్గిస్తుందని, కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రయాణంలో తాము మరో మైలురాయిని అధిగమించామన్నారు. ఇదిలా ఉండగా.. బయోలాజికల్-ఈ ఇంతకు ముందు ఒక్కో డోస్ టీకా ధరను రూ.250కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని పన్నులతో కలిపి ఒక్కో డోసు టీకా కేంద్రాల్లో రూ.400కు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతకు ముందు ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో పన్నులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీలతో కలిపి ఒక్కో డోసుకు రూ.990 ఖర్చయ్యేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డీసీజీఐ కార్బెవాక్స్ 5-12, 6-12 సంవత్సరాల పిల్లలకు టీకా వేసేందుకు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసిన విషయం విధితమే.