లక్నో: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి చనిపోవడానికి పోలీసులు కారణమని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై దాడి చేయడంతోపాటు కర్రలతో కొట్టారు. (Cops Thrashed By Mob) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో ఒక ట్రాక్టర్ను పోలీసులు వెంబడించారు. పోలీసులను తప్పించుకునే క్రమంలో వేగంగా వెళ్తున్న ఆ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో సోను అనే వ్యక్తి ట్రాక్టర్ కింద పడి మరణించాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఠాకూర్ద్వారా-జస్పూర్ రహదారిని దిగ్బంధించారు. సోను మరణానికి కారణమైన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు తిరుగబడ్డారు. రాళ్లు రువ్వడంతోపాటు కర్రలతో పోలీసులపై దాడి చేశారు. దీంతో పోలీసులు పరుగులు తీశారు. ఈ దాడిలో ఒక పోలీస్ అధికారి స్పృహతప్పి పడిపోయాడు.
మరోవైపు ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ అధికారులు దిగి వచ్చారు. నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు. గ్రామస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, గ్రామస్తులు కర్రలతో పోలీసులపై దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मुरादाबाद में युवक की मौत के बाद बवाल, ग्रामीणों ने पुलिस टीम को जमकर पीटा…जीप की हवा निकाली#MORADABAD pic.twitter.com/e5ooNDm0E6
— Amrit Vichar (@AmritVichar) September 27, 2024