బెంగళూరు: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుని కొందరు పోలీసులు కుక్కల్లా నిద్రపోతారని ఆయన మండిపడ్డారు. ‘లంచాలు తీసుకున్న మీ పై అధికారులు కుక్కల్లా నిద్రపోతారు. మీకు ఆత్మగౌరవం ఉండాలి’ అని ఓ వీడియోలో మంత్రి ఓ పోలీసుపై మండిపడడం రికాైర్డెంది. పోలీసు బలగం కుళ్లిపోయిందని ఆయన అందులో కేకలు వేశారు.