Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక మహిళపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రాంచి: పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక మహిళపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. (Cop Arrested For Raping Woman) జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖర్స్వాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 29 రాత్రి వేళ గంహారియా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త తనను కొడతాడన్న భయంతో భార్య ఇంటి నుంచి బయటకు వచ్చింది. పొరుగువారి ఇంటికి వెళ్ళిన ఆ మహిళ తన మొబైల్ ఫోన్ నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒక పీసీఆర్ వ్యాన్ అక్కడకు చేరుకున్నది. ఆ రాత్రి వేళ మహిళను గంహారియా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విశ్రాంతి కోసం పోలీస్ స్టేషన్‌లోని ఒక గదిని ఆమెకు ఏర్పాటు చేశారు.
కాగా, ఆ పోలీస్ స్టేషన్లో వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు జరుపాలని సెరైకెలా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌ను ఎస్పీ ఆదేశించారు. ఎస్డీపీవో నివేదిక ఆధారంగా నిందితుడైన కానిస్టేబుల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మరోవైపు సంఘటనా సమయంలో నిందితుడు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష కోసం రాంచీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి వాటిని పంపారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతారహిత ప్రవర్తన, క్రమశిక్షణారాహిత్యం వంటి ఆరోపణలపై గమ్హరియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అధికారిని, మరో నలుగురు పోలీస్ సిబ్బందిని కూడా ఎస్పీ సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

