న్యూఢిల్లీ, మార్చి 24: గర్భనిరోధక మాత్రలు త్వరలోనే పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఎలుకలపై జరిపిన ప్రయోగాలు విజయవంతం అయినట్టు అమెరికాలోని మిన్నెసొటా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాము మగ ఎలుకలపై పరీక్షించిన ఔషధం 99% ప్రభావవంతంగా పనిచేసినట్టు వెల్లడించారు. ఇది పురుష హార్మోన్లపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు వైసీటీ529 అనే ఔషధాన్ని నాలుగు వారాల పాటు ఎలుకలకు ఇచ్చారు. ఎలుకల్లో వీర్య కణాల వృద్ధి గణనీయంగా తగ్గింది. డోసును నిలిపివేసిన 4-6 వారాల తర్వాత మళ్లీ యథావిధిగా ఉత్పత్తి అయ్యాయి.