కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం
కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో విపక్ష జేడీఎస్ విజయం సాధించింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించగా, మరో రెండింటిలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
- నాలుగు స్థానాల్లో ఒక్కటీ దక్కని వైనం
- సిట్టింగ్ స్థానాన్నీ కోల్పోయిన హస్తం పార్టీ
- బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌పై జేడీఎస్ విజయం
బెంగళూరు, అక్టోబర్ 27 : కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో విపక్ష జేడీఎస్ విజయం సాధించింది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించగా, మరో రెండింటిలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఈ నెల 23న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగళూరులో ఉపాధ్యాయ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుట్టన్నపై విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుట్టన్న జేడీఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
ఈసారి అదే నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రంగనాథ్, పుట్టన్న ఇద్దరూ వొక్కలిక సామాజిక వర్గానికే చెందినప్పటికీ ఓటర్లు రంగనాథ్వైపే మొగ్గుచూపారు. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శశిల్జీ నామోశి.. కాంగ్రెస్ అభ్యర్థి శరణప్ప మత్తూర్పై విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి నామోశి గెలడంం ఇది ఐదోసారి. కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని కలబురిగి, దాని పొరుగు జిల్లాలు ఈ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతమైన కలబురిగిలో బీజేపీ విజయం సాధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
డీకే, సిద్ధూ ప్రచారం చేసినా..
దక్షిణ మధ్య పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేఎం సురేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి శశి హులికంటె ముత్తపై, పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్సీ ఎస్వీ సంకనూరు.. కాంగ్రెస్ అభ్యర్థి లింబియారిపై ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్-బీజేపీ సమన్వయంతో పనిచేయగా, కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఇతర మూడింటిలో విజయం సాధించాలని వ్యూహాలు పన్ని బోర్లాపడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సీఎం డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌తో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆ పార్టీకి భంగపాటు తప్పలేదు. కర్ణాటక శాసనమండలిలో మొత్తం 75 స్థానాలు ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు 38, బీజేపీకి 24, జేడీఎస్‌కు ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఒక స్వతంత్ర సభ్యుడితో పాటు మండలి చైర్మన్ సలీం అహ్మద్ కూడా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

