Farmers Protest | అన్నదాతలకు ఆసరాగా నిలుస్తాం : మల్లికార్జున్ ఖర్గే
Farmers Protest : కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అన్నిరకాలుగా బాసటగా నిలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లింకార్జున్ ఖర్గే బుధవారం స్పష్టం చేశారు.
Farmers Protest : కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అన్నిరకాలుగా బాసటగా నిలుస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లింకార్జున్ ఖర్గే బుధవారం స్పష్టం చేశారు. నిరసనలకు దిగిన రైతులకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటంందని, వారి న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని తమ పార్టీ కోరుతోందని ఆయన వివరించారు.
రైతుల సమస్యలను తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని, ఎంఎస్పీ కోసం చట్టాన్ని తీసుకువస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. రైతులకు ప్రభుత్వం అందించే ఎంఎస్పీని రెట్టింపు చేస్తామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ ఆ హామీ ఊసెత్తలేదని అన్నారు. ఎంఎస్పీ అమలు చేయాలని రైతులు ఎప్పటినుంచో కోరుతున్నా మోదీ సర్కార్ పట్టించుకోలేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ఎంఎస్ స్వామినాధన్ నివేదిక సిఫార్సులను మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ అంతకుముందు కాషాయ పాలకులపై విరుచుకుపడ్డారు. దేశంలో రూ 14 లక్షల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, రూ. 1.8 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేశారని, కానీ కొద్దిమొత్తంలోనైనా రైతు రుణాలను మాత్రం మాఫీ చేయలేదని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎంఎస్పీకి హామీ ఇవ్వడం ద్వారా మన రైతులు బడ్జెట్‌కు భారం కారని, జీడీపీ వృద్ధికి సారధులవుతారని చెప్పారు.
Read More :
Paracetamol | పారాసిటమాల్‌తో కాలేయానికి ముప్పు.. ఎలుకల్లో ప్రయోగంతో నిర్ధారణ..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

