న్యూఢిల్లీ: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది. తాము కరోనా పాజిటివ్ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం పేర్కొన్నారు. తమను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని ట్వీట్ చేశారు. తాను కరోనా బారిన పడినప్పటికీ బెంగాల్లో వర్చువల్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని అధీర్ రంజన్ తెలిపారు. కాగా, అధీర్ దా తర్వగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
I have been tested covid positive, requesting all who came in contact with me for last 7 days must comply with covid protocols, I will be continuing my campaign through virtual platform, I do suggest and request all to take utmost care to keep away covid from your lives.
— Adhir Chowdhury (@adhirrcinc) April 21, 2021
మరోవైపు కరోనా పరీక్ష కోసం రెండు రోజులు నిరీక్షించి టెస్ట్ చేయించుకున్న రోజున్నర తర్వాత కరోనా పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణ అయిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు. పాజిటివ్ మైండ్, విశ్రాంతి, ఆవిరి పట్టడం, ఫ్లూయిడ్స్ ద్వారా దీని నుంచి కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరి, 85 ఏండ్ల తల్లికి కూడా కరోనా సోకిందని ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు.
After waiting two days for a test appointment and another day & a half for the results, I finally have confirmation: I’m #Covid positive. Hoping to deal with it in a “positive” frame of mind, with rest, steam & plenty of fluids. My sister& 85 year old mother are in the same boat.
— Shashi Tharoor (@ShashiTharoor) April 21, 2021