జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా మొత్తం 15 మందికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అందులో 11 మందిని కేబినెట్ హోదాలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ పదిహేను మంది నూతన మంత్రుల చేత రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. జైపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
కొత్తగా రాజస్థాన్ మంత్రివర్గంలో చేరిన వారిలో హేమంత్ చౌదరి, గోవింద్ రామ్ మేఘ్వాల్, శకుంతల రావత్, బ్రిజేంద్ర సింగ్ ఓలా, మురారీలాల్ మీనా, రమేశ్ మీనా, మమతా భూపేష్ బైర్వా, భజన్‌లాల్ జాతవ్, తీకారామ్ జూలీ, మహేంద్రజీత్‌సింగ్ మాల్వీయ, రామ్‌లాల్ జాట్, మహేష్ జోషి, విశ్వేంద్రసింగ్, రాజేంద్ర గడ్డా, జహీదా ఖాన్ ఉన్నారు.
Rajendra Gudda and Zahida Khan have also been sworn in as ministers of state in Rajasthan Government at a function at Raj Bhavan in Jaipur pic.twitter.com/hoynqPohA3
— ANI (@ANI) November 21, 2021
Ramesh Meena, Mamta Bhupesh Bairwa, Bhajan Lal Jatav, and Teekaram Juli take oath as Cabinet ministers in the Rajasthan Govt, at a function in Jaipur pic.twitter.com/vvMsVEOtDG
— ANI (@ANI) November 21, 2021