నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ పెంచుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ఇలా రోజు రోజుకీ పెట్రో ధరలను పెంచడమంటే పేద ప్రజలను అవమానించడమే అవుతుందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ ధరల పెరుగుదల అంతా తాము ఊహించిందేనని పేర్కొన్నారు. పన్నుల పెంపు, ధరల పెరుగుదల అనేవి బీజేపీ ట్రేడ్ మార్క్ అయిపోయిందని థరూర్ ఎద్దేవా చేశారు. పెట్రో డీజిల్ ధరల పెరుగదల ఊహించిందే. ఇలా పెంచడమంటే పేద ప్రజలను అవమానించడమే. పన్నుల పెంపు, ధరల పెరుగుదల అనేవి బీజేపీ ట్రేడ్ మార్క్‌గా స్థిరపడిపోయింది అని థరూర్ ఎద్దేవా చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పెట్రో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధర 50 పైసలు, డీజిల్ రేటు 55 పైసలు పెరిగింది. గత ఆరు రోజుల్లో పెట్రో రేట్లు పెరగడం ఇది ఐదోసారి. ఈ కొత్త రేట్లతో ఢిల్లీలో పెట్రోలు లీటరు 99.11 రూపాయలకు చేరింది. డీజిల్ ధర 89,87కు చేరింది.