న్యూఢిల్లీ : బీజేపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా (Randeep Singh Surjewala) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. హరియాణలోని కైధల్లో ఆదివారం జరిగిన జనాక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ సుర్జీవాలా కాషాయ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జేజేపీ నేతలు రాక్షసులని, బీజేపీకి ఓటు వేసే వారు ఆ పార్టీకి మద్దతిచ్చేవారు కూడా రాక్షసులేనని మండిపడ్డారు.
మహాభారతం జరిగిన ప్రాంతం నుంచి తాను ఈ విషయం చెబుతున్నానని సుర్జీవాలా పేర్కొన్నారు. సుర్జీవాలా ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక సుర్జీవాలా వ్యాఖ్యలను కాషాయ నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీని దేశ నేతగా ప్రొజెక్ట్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలనే దూషిస్తోందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ట్వీట్ చేశారు.
సుర్జీవాలా వ్యాఖ్యలను బీజేపీ నేత గౌరవ్ భాటియా కూడా తోసిపుచ్చారు. రాహుల్ గాంధీని లాంఛ్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలపై ఆగ్రహం వెళ్లగక్కుతోందని అన్నారు. ఏ పార్టీకైనా ఓటు వేసి, మద్దతు తెలిపే హక్కు దేశ పౌరులకు ఉందని, మీ ఆలోచనా ధోరణి, భాషతో మీరు దేశ వ్యతిరేకులుగా తయారయ్యారని వెల్లడవుతోందని పేర్కొన్నారు.
Read More :
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి.. ఏడుగురు మృతి