లక్నో: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒక వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని మరో ఇద్దరితో కలిసి బెదిరించాడు. దీంతో బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (Congress leader arrested) ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంభాల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ శర్మపై దేశ్ రాజ్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని సుభాష్ శర్మ, సుధీష్ శర్మతో కలిసి ఆయన డిమాండ్ చేయడంతోపాటు తనను బెదిరించారని ఆరోపించాడు.
కాగా, దేశ్ రాజ్ సింగ్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విజయ్ శర్మతోపాటు సుభాష్ శర్మ, సుధీష్ శర్మపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి విజయ్ శర్మను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.