Rajasthan CM : లోక్‌సభ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. దాంతో బీజేపీ నేతలు కేంద్రంలో మరోసారి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా బీజేపీలో చేరికలపై మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని, మునుగుతున్న పడవలో ఎవరు కూర్చుంటారని ప్రశ్నించారు. అందుకే ఇతర ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ మొత్తం 25 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. 25 స్థానాల్లో కేవలం గెలువడమే కాదు , భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలను గెలుస్తుందని అన్నారు.