కాంగ్రెస్‌కు గుండుసున్నా
నాలుగు రాష్ర్టాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోని 28 శాసనమండలి స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక చతికిలపడింది. ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానం సహా రాష్ట్రంలోని నాలుగు స్థానాలనూ బీజేపీ, జనతాదళ్(సెక్యులర్) కూటమి కైవసం చేసుకోవడంతో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి రిక్తహస్తం ఎదురైంది.
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం
- 4 రాష్ర్టాల్లోని 28 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటీ గెలువలే
- కర్ణాటకలోనూ జీరో వారణాసిలో బీజేపీపై ఎస్పీ గెలుపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నాలుగు రాష్ర్టాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోని 28 శాసనమండలి స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక చతికిలపడింది. ముఖ్యంగా ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానం సహా రాష్ట్రంలోని నాలుగు స్థానాలనూ బీజేపీ, జనతాదళ్(సెక్యులర్) కూటమి కైవసం చేసుకోవడంతో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి రిక్తహస్తం ఎదురైంది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి, భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సుడిగాలి ప్రచారం చేస్తున్న తరుణంలో తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే అత్యంత నష్టదాయకమైన ఓటమిని చవిచూడటం గమనార్హం. కర్ణాటక ఫలితాలు ఇతర ప్రాంతాల ఫలితాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2023 నుంచి అధికారంలో కొనసాగుతున్న రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది.
కాబట్టి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి సాధించిన ఈ భారీ విజయం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, దాని స్థానిక నెట్‌వర్క్‌లు, ఎన్నికల పరంగా కీలకమైన రెండు వర్గాల మధ్య ఆ పార్టీ చేపట్టిన ప్రచారం ఎంతవరకు ప్రభావవంతంగా ఉందనే అంశాలపై దృష్టిని మళ్లిస్తున్నది. ఈ ఫలితం ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కూడా ఒక ఎదురుదెబ్బే. ఆయన కర్ణాటకలో పార్టీ వ్యవస్థను ఎన్నికల ప్రచారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఈనెల 23న జరిగిన ఈ ఎన్నికలు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి మించి ప్రజల మద్దతును కూడగట్టడంలో అధికార పార్టీకి ఉన్న సామర్థ్యాన్ని పరీక్షించే కీలక సందర్భమయ్యాయి. డీకే స్వయంగా మంత్రులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేయడం, ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో తెలియచేస్తున్నది.
మిగిలిన మూడు రాష్ర్టాల్లో..
మహారాష్ట్ర, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న బలహీనమైన పనితీరు ఒక విస్తృత ఎన్నికల సవాలులో భాగమేనని సూచిస్తున్నాయి. అయితే కర్ణాటకతో పోలిస్తే ఈ రాష్ర్టాల్లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో లేదు. అంతేగాకుండా అక్కడ ఎన్నికల పోటీ అనేది ప్రాంతీయ పార్టీలు, కూటములు, స్థానిక అభ్యర్థుల బలంపై ఆధారపడి సాగుతున్నది.
మోదీ ఇలాఖాలో అఖిలేశ్ పాగా!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని రెండు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వారణాసి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టుకుంది. వారణాసి పట్టభద్రుల నియోజకవర్గంలోనూ విజయం సాధించింది. మొత్తం మీద ఎన్నికలు జరిగిన ఉత్తర ప్రదేశ్‌లోని 11 శాసనమండలి స్థానాల్లో హోరాహోరీ పోరు జరగగా బీజేపీ ఆరింటినీ, ఎస్పీ ఐదింటిని కైవసం చేసుకున్నాయి.
వారణాసి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు లక్నో, అలహాబాద్-ఝాన్సీ పట్టభద్రుల స్థానాలు, ఆగ్రా ఉపాధ్యాయుల నియోజకవర్గాలను ఎస్పీ గెలుచుకుంది. లక్నో, మీరట్-సహారన్పూర్, గోరఖ్‌పూర్-ఫైజాబాద్, బరేలీ-మొరాదాబాద్ ఉపాధ్యాయ స్థానాలు, మీరట్-సహారన్పూర్ పట్టభద్రుల నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది. బీహార్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ-3, స్వతంత్రులు-2, జేడీయూ, జన్‌సురాజ్, ఆర్జేడీ ఒక్కొక్క స్థానంలో గెలుపొందాయి. మహారాష్ట్రలో బీజేపీ 1, ఎన్సీపీ (ఎస్పీ) 2, శివసేన ఒక స్థానంలో గెలిచాయి.
కాంగ్రెస్ ఓటమిపై మోదీ వ్యంగ్యాస్ర్తాలు

బ్యాలట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పటికీ నాలుగు రాష్ర్టాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీపై వ్యంగ్య విమర్శలు గుప్పించారు. ఈవీఎంల వినియోగంపై కాంగ్రెస్ పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేయడం, తిరిగి బ్యాలట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆ పార్టీని ఎద్దేవా చేసేలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి అంటూ బుధవారం ఎక్స్ పోస్టులో నెటిజన్లను ప్రధాని అడిగారు. ఆ ప్రశ్నను మోనోకిల్తో ఆలోచిస్తున్న ముఖం ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు. మోనోకిల్ ద్వారా చూస్తున్న ముఖాన్ని సూచించే ఎమోజీని సాధారణంగా ఉత్సుకతను లేదా సందేహాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తారు. నాలుగు పెద్ద రాష్ర్టాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటకలోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి? అంటూ మోదీ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 28 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడమే మోదీ వ్యంగ్య వ్యాఖ్యలకు కారణం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

