చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్ తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు లభించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. దీంతో మద్దతిచ్చిన కాంగ్రెస్కు రెండు, వామపక్షాలైన సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకేకు ఒకటి చొప్పున మంత్రి పదవులు లభించవచ్చని తెలుస్తున్నది. (Vijay’s Cabinet) ఈ నాలుగు పార్టీల మద్దతుతో తన తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేయనునున్నారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ఒప్పందం ప్రకారం మిత్రపక్షాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు.
కాగా, టీవీకేకు తొలుత మద్దతు ప్రకటించిన ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నది. ఇద్దరు చొప్పున్న ఎమ్మెల్యేలున్న సీపీఐ, సీపీఎంతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలున్న విడుదలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే)కు కూడా ఒక్కో మంత్రి పదవి దక్కనున్నది. అలాగే వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ స్వయంగా మంత్రివర్గంలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
Also Read:
TVK secures magic number | టీవీకేకు వీసీకే, వామపక్షాల మద్దతు.. మ్యాజిక్ నంబర్ 118 సాధించిన విజయ్
VCK slams TVK | వాట్సాప్ ద్వారా మద్దతు కోరిన టీవీకే.. అహంకారమని వీకేసీ విమర్శ