న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ శుక్రవారం బెంగళూరులో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాయ్ తనను తాను తుపాకీతో కాల్చుకున్నారని, ఆయనకు వైద్య సహాయం అందించినప్పటికీ మరణించినట్టు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. రాయ్ ఆత్మహత్యపై ఐటీ శాఖ ఇంతవరకు స్పందించ లేదు. కాన్ఫిడెంట్ గ్రూప్ దక్షిణాదిలో ఎక్కువగా వ్యాపారం చేస్తున్నది.