పాట్నా, ఏప్రిల్ 21: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణి ప్రాణాన్ని బలి తీసుకొంది. డాక్టర్ అందుబాటు లో లేకపోవడంతో కాంపౌండర్ చేసిన సిజేరియన్ వికటించి బబితాదేవి(28) ప్రాణాలు కోల్పోయింది. బీహార్ రాజధానికి 80 కిలోమీటర్ల దూరంలోని ముస్రిగ రాయ్ పట్ణణంలోని అనిశా హెల్త్‌కేర్ సెంటర్లో ఈ దారు ణం జరిగింది. బబిత మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు దవాఖాన ముందు ధర్నా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.