LPG Cylinder Price | వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంపు.. ఒకేసారి రూ.993 పెంచేసిన చమురు సంస్థలు
LPG Cylinder Price | దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ.993కు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
LPG Cylinder Price | దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ.993కు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు నేటి నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలండర్ ధర రూ.3,071.50కి చేరింది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
అమెరికా- ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో విడతల వారీగా కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. ఫిబ్రవరి 28 తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మార్చి ప్రారంభంలో సుమారు రూ.115 పెరిగిన ధరలు, ఏప్రిల్ 1న 200 వరకు పెరిగాయి. ఇప్పుడు ఒకేసారి రూ.993 పెంచారు. దీంతో ఒక్క వాణిజ్య సిలిండర్ ధర రూ.3వేలు దాటింది. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది.
ఇంధన ధరల విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్2లో ఇంధన ధరలు పెరిగినప్పటికీ ఆయిల్ కంపెనీలు వాటిని భరిస్తున్నాయని తెలిపింది. దీంతో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. ఇక దేశీయ ఎయిర్‌లైన్స్‌కు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను కూడా కేంద్రం యథాతథంగా ఉంచింది. అంతర్జాతీయ విమానాల కోసం మాత్రం స్వల్పంగా ధరలను పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

